అన్ స్టాపబుల్ 2లో ప్రభాస్ - గోపీచంద్ ఎపిసోడ్ హైలెట్ అవుతోంది. బాలయ్యతో చిట్ చాట్ లో వీరిద్దరూ ఏం మాట్లాడుకొన్నారు? ఎన్ని కొత్త సంగతులు పంచుకొన్నారు? అనే విషయాల గురించి ఆసక్తిగా ఎదురు చూశారు అభిమానులు. ఇప్పుడు పూర్తి ఎపిసోడ్ వచ్చేసింది. అన్ స్టాపబుల్ ప్రోమోల్లో `మీ ఇద్దరూ ఓ హీరోయిన్ కోసం గొడవ పడ్డారట` అనే ప్రశ్నకు సంబంధించిన క్లిప్ బాగా వైరల్ అయ్యింది. ఆ హీరోయిన్ ఎవరు? అంటూ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. తనెవరో కాదు... త్రిష.
బాలయ్య అడిగిన ప్రశ్నకు గోపీచంద్ సరదాగా.. `త్రిష` అని సమాధానం చెప్పాడు. వర్షంలో ప్రభాస్ హీరో అయితే... గోపీచంద్ విలన్. త్రిష కథానాయికగా నటించింది. అందుకే గోపీచంద్ చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకొన్నాడు. నిజానికి గోపీచంద్, ప్రభాస్‌లు అనుష్క గురించి గొడవ పడ్డారని అప్పట్లో ఓ రూమర్ ఉండేది. ఆ రూమర్ కి క్లారిటీ ఇవ్వడానికే... బాలయ్య ఈ ప్రశ్న అడిగాడని, దానికి గోపీచంద్ తెలివిగా సమాధానం చెప్పి... టాపిక్ డైవర్ట్ చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.