మెగాస్టార్ చిరంజీవిని ఎనర్జీ పరంగా చూస్తే 'పవర్ ప్లాంట్' అనొచ్చు. ఈ వయసులో ఆయనలో ఆ ఎనర్జీ ఎలా సాధ్యం? అని ప్రశ్నిస్తే తాను ఎవరితో మాట్లాడినా, ఆ మాటల్లోంచి ఎనర్జీని సృష్టించుకుంటానంటారు. చిన్న పిల్లలతో మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో ముచ్చటిస్తున్న చిరంజీవి, వారి సామర్థ్యం చూసి ఆశ్చర్యపోవడమే కాదు, తన వయసుని వాళ్ళ వయసుకి తగ్గించేసుకుని, వారిలా ఆలోచించి, వారిలా ఎనర్జీ పొందాలనుకుంటారు. అదే తన సక్సెస్ సీక్రెట్ అని చిరంజీవి చెప్పారు. చిరంజీవికి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే చిన్న పిల్లలతో అంతగా కలిసిపోగలుగుతున్నారు. అయితే చిరంజీవి నుంచి స్ఫూర్తి పొందేవారెందరో ఉన్నారు. చిన్నప్పుడే ఈ స్పూర్తి చాలా మందిలో మొదలువుతూ ఉంటుంది. చిరంజీవి మేనియా అంటే అదే. ఎంతో మంది ఎనర్జిటిక్ పీపుల్ తమ ఎనర్జీకి కారణం ఎవరని అడిగితే చిరంజీవే అని తడబడకుండా చెప్పేస్తారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ లాంటి రాక్ స్టార్స్ కూడా తమ ఎనర్జీకి చిరంజీవే కారణమని అంటారు. చిరంజీవిని చూస్తే చాలు తమలో మెగా పవర్ జనరేట్ అవుతుందంటారు. అందుకే మెగాస్టార్ ఓ పవర్ ప్లాంట్ అని చెప్పక తప్పదు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి వచ్చి ఎంట్రీతోనే భీభత్సంగా సత్తా చాటారు. త్వరలోనే మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. చిరంజీవి తర్వాత చేయబోయే సినిమా 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.