యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్‌కి జంటగా 'నేను శైలజ..' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కీర్తి సురేష్. తొలి సినిమానే అయినా కానీ ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న నటిలా బరువైన పాత్రలో నటించి మెప్పించింది. అందుకే ఆమెకి ఆ ఒక్క సినిమాతోనే ఎంతో గుర్తింపు వచ్చేసింది. ఇటు తెలుగులోనే కాకుండా, తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించేసింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ ఏకంగా స్టార్ హీరోలు విజయ్, థనుష్ సరసన కూడా నటించేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోలతో నటించడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఎందుకంటే తనకి స్టార్ హీరోలతో కన్నా, యంగ్ హీరోలతో నటిస్తేనే ఎక్కువ కంఫర్ట్‌బుల్‌గా ఉంటుందంటోంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్, మహేష్ సినిమాల్లో నటించనుంది. అయితే వీరు సీనియర్ హీరోలు కాదని అమ్మడి ఉద్దేశ్యం కాబోలు. అంటే కీర్తి సురేష్ దృష్టిలో స్టార్ హీరోలు అంటే పెద్ద హీరోల అని అర్ధమట. అంటే వీళ్లు కాక ఇంకా పెద్ద హీరోలన్న మాట. ఎందుకంటే పెద్ద హీరోల పక్కన అంత బాగా కనిపించననీ, తేలిపోతానని తనకి భయం అంటోందట. ఇటీవలే నానితో 'నేను లోకల్' సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు చిత్రాలు అమ్మడి చేతిలో ఉన్నాయి.