చిరంజీవిని అంతలా కట్టి పడేసిన ఆ పాట ఏంటి.?

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియాలోకి ఎంటర్‌ అవుతూనే వరుస ట్వీట్లతో రఫ్ఫాడించేస్తున్నారు. చిరంజీవి టైమింగ్‌.. చిరంజీవి స్పాంటేనిటీ.. ఆయన ట్విట్టర్‌ హ్యాండిల్‌ని హాట్‌ టాపిక్‌గా మార్చేసింది. వివిధ అంశాలపై మెగాస్టార్‌ వేస్తోన్న ట్వీట్లు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.. అభిమానుల్నే కాదు.. అందర్నీ ఓ రేంజ్‌లో అలరిస్తున్నారు. తాజాగా చిరంజీవి ఓ ఆసక్తికరమైన ట్వీటేశారు. అది కూడా ఓ పాట గురించి. సాధారణంగా పాట షూటింగ్‌ జరుగుతున్నప్పుడు పాటని వినడానికి ఇష్టపడతాననీ, ఎక్కడా ఇంటరప్షన్స్‌కి ఆస్కారమివ్వననీ చెప్పారు.

 

అయితే, ఓ పాట వింటున్నప్పుడు మాత్రం పదే పదే పాటను ఆపడం, మళ్ళీ కొనసాగించడం చేశానని చెప్పారు. అయితే, ఆ పాట ఏంటన్నది మాత్రం ప్రస్తుతానికి ఆయన సస్పెన్స్‌లో వుంచారు. రేపు ఉదయం చిరంజీవి ఆ సస్పెన్స్‌ని రివీల్‌ చేయబోతున్నారట. ఆ పాట ఇంకోటేదో కాదు, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తోన్న ‘వకీల్‌సాబ్‌’ సినిమా నుంచి ‘మగువా మగువా..’ అంటూ సాగే పాట అని మెగా అభిమానులు అంటున్నారు. ఏమో, చిరంజీవి మనసులో అదే వుందా.? ఇంకేదైనా సర్‌ప్రైజ్‌ చిరంజీవి రేపు ఇవ్వబోతున్నారా.? రేపు ఉదయం 9 గంటలకు చిరంజీవి ఆ సస్పెన్స్‌ని రివీల్‌ చేస్తారట. ఇదిలా వుంటే, చిరంజీవి ట్విట్టర్‌ అకౌంట్‌కి ఇప్పటికే దాదాపు నాలుగున్నర లక్షల మంది ఫాలోవర్స్‌ జాయిన్‌ అయ్యారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS