కొరటాల-ఎన్టీఆర్ ఇక లేనట్టేనా?

మరిన్ని వార్తలు

తీసిన మూడు సినిమాలు అయినా మూడుకిమూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దర్శకుడు కొరటాల శివ. ఇప్పుడు ఈ దర్శకుడు డేట్స్ కావాలని అగ్ర హీరోలందరు పోటీపడుతున్నారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే ఒక్క హీరో మాత్రం ఈయనతో చిత్రం చేసే అవకాశం ఉన్నా చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్టు సమాచారం. వివరల్లోకి వెళితే, ఎన్టీఆర్-కొరటాల కలయికలో ఒక చిత్రం రానుంది అని ప్రకటన కూడా వచ్చేసింది. అయితే అది ఇప్పుడు అది జరిగే పరిస్థితి లేదు అని సమాచారం.

 

ఎందుకంటే- ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసే చిత్రం ఇంకొక రెండు నెలల్లో మొదలవ్వనుంది అది అవ్వగానే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి చేసే సినిమా మొదలవుతుందట. ఇక దీనితో కొరటాల దర్శకత్వంలో మళ్ళీ చిత్రం చేసే అవకాశం ఇప్పుడప్పుడే లేనట్టు అర్ధమవుతున్నది. 

ఇక కొరటాల విషయానికి వస్తే, ఆయన మహేష్ తో చేస్తున్న చిత్రం ఈ వేసవికి విడుదల అవుతున్నది. దాని తరువాత ఆయన ఎవరిని డైరెక్ట్ చేస్తారు అన్నదాంట్లో ఇంకా స్పష్టత రాలేదు. మొత్తానికి.. జనతా గ్యారేజ్ మ్యాజిక్ పునరావృతం అవ్వడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS