ఈరోజే మెగా డాటర్ నిహారిక పెళ్లి. రాత్రి సరిగ్గా 7 గంటల 15 నిమిషాలకు చైతన్య - నిహారిక ఒకటి కాబోతున్నారు. రెండు రోజుల నుంచి ఉదయ్ పూర్‌లో... పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన సంగీత్ అయితే సూపర్ హిట్. చిరు, చరణ్, బన్నీ, వరుణ్‌తేజ్, నిహారిక.. వీళ్లంతా స్టెప్పులు వేశారు. ఆఖరికి... అల్లు అరవింద్ కూడా రంగంలోకి దిగి - డాన్స్ చేసి అలరించారు. పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్ చేసుకుని వధూవరులను ఆశీర్వదించారు. పవన్ రాకతో.. ఈ పెళ్లి సందడి రెట్టింపు అయ్యింది.
అయితే.. నిహారిక పెళ్లి సందర్భంగా చిరంజీవి ఖరీదైన కానుక ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏకంగా 2 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాన్ని నిహారికకు కానుకగా ఇచ్చార్ట. పవన్ నుంచి ఎలాంటి కానుక అందిందో మరి..? ఈ రోజు, రేపు కూడా మెగా కుటుంబం ఉదయ్ పూర్‌లోనే ఉండబోతోంది. అక్కడి నుంచి తిరిగొచ్చాక... హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విందులో చిత్రసీమకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు.