చిరంజీవి కథానాయకుడిగా మలయాళ రీమేక్ `లూసీఫర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకుడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ అందిస్తోంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది కూడా. ఈ చిత్రానికి `గాడ్ ఫాదర్` అనే పేరు దాదాపుగా ఖాయం చేసేశారు. ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ టైటిల్ ని ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో కథానాయికగా నయనతార పేరు పరిశీలనలో ఉంది.
మరో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రంలో మరో హీరోకీ ఛాన్స్ వుంది. మలయాళంలో ఫృథ్వీరాజ్ చేసిన పాత్ర అది. తెలుగులో ఓ మెగా హీరోతో చేయిస్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ.. ఆ ఛాన్స్ తమిళం నుంచి విక్రమ్‌కి గానీ, బాలీవుడ్ నుంచి సల్మాన్‌ఖ ఖాన్‌కి గానీ దక్కే అవకాశం ఉంది అనే వార్తలొస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు చేసినా.. గాడ్ ఫాదర్ రేంజ్ పెరిగినట్టే. ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని, మాతృక కంటే.. భిన్నంగా ఈ సినిమాని మలుస్తున్నారని, కథలోనూ కీలకమైన మార్పులు చేశారని సమాచారం.