మెగాస్టార్ చిరంజీవి డాన్సులేస్తే.. అభిమానుల్లో ఉప్పొంగే ఆనందం అంతా ఇంతా కాదు. వయసు మీద పడ్తున్నా, మెగాస్టార్ చిరంజీవి డాన్సుల్లో గ్రేస్ తగ్గలేదని ‘ఖైదీ నెంబర్ 150‘ సినిమా నిరూపించింది. రాజకీయాల కారణంగా సినిమాలకు దూరమైనా, 9 ఏళ్ళ విరామం తర్వాత.. వెండితెరపైకి వస్తూనే డాన్సులతో సత్తా చాటారు చిరంజీవి. అయితే, ‘సైరా నరసింహారెడ్డి‘ మాత్రం డాన్సుల పరంగా చిరంజీవి అభిమానుల్ని కొంత నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తన తదుపరి సినిమా ‘ఆచార్య’లో డాన్సుల డోసు కాస్త ఎక్కువగానే వుండేలా చూసుకుంటున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే.
ఇలా వుంటే, ఇటీవల అంతర్జాతీయ డాన్స్ దినోత్సవం సందర్భంగా చిరంజీవి, తన అభిమానుల కోసం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేయాలనుకున్నారు. కానీ, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అది వీలు పడలేదు. తాజాగా ఆ వీడియోను చిరంజీవి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేశారు. 80ల కాలంలో ఓ వెలుగు వెలిగిన సినీ తారల రీ-యూనియన్ సందర్భంగా తీసిన వీడియో అది. సాధారణంగా ప్రతి యేడాదీ చిరంజీవి సహా జయప్రద, జయసుధ, సుహాసిని, రాధ, రాధిక, ఖుష్బూ, వెంకటేష్.. ఇలా ప్రముఖ నటీనటులు ఈ రీ యూనియన్ కార్యక్రమంలో పాల్గొంటుంటారు. ఈ సందర్భంగా చిరంజీవి పలు పాటలకు సీనియర్ హీరోయిన్లతో వేసిన డాన్సులు పై వీడియోలో పొందుపర్చబడ్డాయి. కెవ్వు కేక.. అనే స్థాయిలో వున్న చిరంజీవి గ్రేస్ చూసి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తదితరులు ‘బాసూ.. సూపర్ మీ గ్రేసూ..‘ అంటూ కితాబులిస్తున్నారు.
Fun is meeting friends. Fun is a little dance.
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 3, 2020
As promised, here is the throwback dance video #80sClub #10thReunion @hasinimani @khushsundar @JSKapoor1234 @ActressRadha @realradikaa#LissyPriyadarshan pic.twitter.com/c4fiHnDMRh