ఆచార్యలో కథానాయికల సమస్య కొనసాగుతోందన్నది టాలీవుడ్ టాక్. ఇది వరకు ఈ సినిమా కోసం త్రిషని ఎంచుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల త్రిష తప్పుకుంది. ఆ స్థానంలో కాజల్ ని తీసుకొచ్చారు. కానీ కాజల్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని టాలీవుడ్ టాక్. లాక్ డౌన్ ఎత్తేశాక కమల్ హాసన్ తో `భారతీయుడు 2` సినిమాని పూర్తి చేయాలని, అందుకే `ఆచార్య` చేయలేకపోతున్నానని కాజల్ చిత్రబృందానికి చెప్పిందని, అందుకే కొరటాల శివ మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నాడని చెప్పుకున్నారు.
అయితే ఈ రూమర్లలో ఏమాత్రం నిజం లేదని తేలింది. ఆచార్య టీమ్ తో కాజల్ కొనసాగుతోందని, చేతిలో ఎన్ని సినిమాలున్నా, ఆచార్యకి కాజల్ తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నదని కాజల్ సన్నిహిత వర్గాలు తెలియచేస్తున్నాయి. కాజల్ `భారతీయుడు 2`లో నటిస్తోంది. అయితే కాజల్ కి సంబంధించిన సన్నివేశాలు సింహభాగం పూర్తయ్యాయి. కాబట్టి.. భారతీయుడుతో కాజల్ కి పెద్ద సమస్య ఎదురు కాకపోవొచ్చు. ఆచార్య సెట్లో మాత్రం ఇంత వరకూ కాజల్ అడుగు పెట్టలేదు.