దాస‌రి కోసం చిరు త్యాగం

మరిన్ని వార్తలు

సుదీర్ఘ విరామం త‌ర‌వాత వ‌చ్చిన చిరంజీవికి బాక్సాఫీసు ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. సంక్రాంతికి విడుద‌లైన‌ ఖైదీ నెం.150కి వ‌సూళ్ల వ‌ర్షం కురిపించారు అభిమానులు. చిరంజీవి గ‌త రికార్డుల్ని బ్రేక్ చేస్తూ... టాలీవుడ్ నెం.2 స్థానాన్ని ద‌క్కించుకొంది ఖైదీ నెం.150. అయితే ఈ సినిమాకి సంబంధించిన  రికార్డులేవీ అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌లేదు. థాంక్స్ మీట్ ఒక‌టి పెట్టి, అక్క‌డే వ‌సూళ్ల గురించి చెప్పాల‌ని చిత్ర‌బృందం భావించింది. అల్లు అర‌వింద్ కూడా ఇదే చెప్పారు. కృత‌జ్ఞ‌తాభినంద‌న స‌భ అంటూ ఒక‌టి నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. అయితే అదెప్పుడ‌న్న విష‌యంలో క్లారిటీ లేదు. ఈవారంలోనే ఖైదీ నెం. 150 గ్రాండ్ స‌క్సెస్ మీట్‌ని హైద‌రాబాద్‌లోని కోట్ల విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో జ‌ర‌పాల‌ని భావించింది చిత్ర‌బృందం. అయితే ఇప్పుడు ఆ ఆలోచ‌న విరమించుకొంది. దానికి కార‌ణం.. ఇటీవ‌ల దాస‌రి నారాయ‌ణ‌రావు అస్వ‌స్థ‌త‌కు గుర‌వ్వ‌డ‌మే అని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో దాస‌రి ముఖ్య అతిథిగా వ‌చ్చి ఈ చిత్ర‌బృందాన్ని ఆశీర్వ‌దించారు. ఇప్పుడు దాస‌రి అనారోగ్యంతో ఉన్న‌ప్పుడు స‌క్సెస్ మీట్ అంటూ సంబ‌రాలు నిర్వ‌హించుకోవ‌డం బాగోద‌ని చిరంజీవి భావించార‌ట‌. అందుకే స‌క్సెస్ మీట్‌ని వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. దాసరి పూర్తిగా కోలుకొన్నాక‌, ఆయ‌న స‌మ‌క్షంలోనే విజ‌యోత్స‌వం జ‌రుపుకోవాల‌ని చిరు నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు తెలుస్తోంది. దాస‌రి మ‌రో మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవ‌కాశం ఉంది. ఆయ‌న పూర్తిగా కోలుకోవ‌డానికి మ‌రో ప‌ది హేను రోజులైనా పడుతుంది. ఆ త‌ర‌వాత స‌క్సెస్ మీట్ నిర్వ‌హించినా లాభం లేదు. సో... ఖైదీ నెం.150 కృతజ్ఞ‌తాభినంద‌న స‌భ అనుమాన‌మే అన్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS