పవన్ కల్యాణ్ ఖాతాలో ఇప్పటికే రెండు విడాకులు ఉన్నాయి. తొలి భార్యకు విడాకులు ఇచ్చి రేణూ దేశాయ్‌ని చేసుకొన్న పవన్.. ఆ తరవాత తనకీ గుడ్ బై చెప్పేసి అన్నాలెజ్‌నోవాని పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ కూతురు కూడా ఉంది. అయితే ఇప్పుడు మూడో భార్యకూ పవన్ విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడన్నది లేటెస్ట్ ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. వీరిద్దరూ ఇప్పుడు సఖ్యతగా ఉండడం లేదట. ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చిందని, ఆ దూరానికి కారణాలు తెలియడం లేదని, పవన్ మరోసారి విడాకులు తీసుకోవడం ఖాయమన్న గాసిప్ ఇప్పుడు టాలీవుడ్‌లో షికారు చేస్తోంది. పవన్ నిజాయతీని అందరూ కొనియాడేవారే. అయితే వ్యక్తిగత జీవితం మాత్రం పవన్ ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. పవన్ పెళ్లిళ్లపై ఇప్పటికే బోల్డన్ని సెటైర్లు పుట్టుకొచ్చేశాయి. పవన్‌ని టార్గెట్ చేసేవాళ్లంతా.. పవన్ చేసుకొన్న మూడు పెళ్లిళ్ల గురించే మాట్లాడుకొంటుంటారు. ఈ నేపథ్యంలో.. పవన్ మరోసారి ఆ తప్పు చేయాలనుకోవడం సాహసోపేతమైన నిర్ణయమే. అందుకే.. `ఇదంతా ఒట్టిమాటే` అంటూ పవన్ సన్నిహితులు ఈ గాసిప్‌ని కొట్టి పారేస్తున్నారు. మరి పవన్ మైండ్‌లో ఏముందో?? తనకసలే కొంచెం తిక్క. ఎప్పుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవొచ్చు. సో.. పవన్.. వాట్ నెక్ట్స్..???