ద‌టీజ్ చిరు: విల‌న్ వైద్యం కోసం రూ.40 ల‌క్ష‌లు

మరిన్ని వార్తలు

ఇండ‌స్ట్రీకి గాడ్ ఫాద‌ర్ అవ‌తారం ఎత్తారు చిరంజీవి. ఎవ‌రికి ఎప్పుడు ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా ఆప‌ద్భాంధ‌వుడిలా కాపాడుతూనే ఉన్నారు. చిరు గుప్త దానాల గురించి బోలెడ‌న్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. అందులో ఇది మ‌రోటి. విల‌న్ పాత్ర‌ల‌కు కేరాఫ్‌గా నిలిచిన త‌మిళ న‌టుడు పొన్నాంబంలం తెలుసు క‌దా? చిరంజీవి చిత్రాల్లో ఎక్కువ‌గా న‌టించాడు. ఘ‌రానా మొగుడు, మెకానిక్ అల్లుడు లాంటి చిత్రాలు అత‌నికి మంచి పేరు తీసుకొచ్చాయి. ఒక‌ప్పుడు వైభ‌వంగా బ‌తికిన పొన్నాంబంలం ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయాడు. ఆరోగ్యం కూడా క్షీణించింది. రెండు కిడ్నీలూ పాడైపోయాయి. ఇలాంటి ద‌శ‌లో చిరంజీవి ఆదుకొన్నారు. వైద్యం కోసం అవ‌స‌రమైన రూ.40 ల‌క్ష‌ల సాహాయాన్ని చిరు స్వ‌యంగా అందించిన వైనం ఇప్పుడు పొన్నాంబంలంనే గుర్తు చేశాడు.

 

''ఓసారి నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కీడ్నీలు పాడైపోయాయి. ఎవ‌రిని అడ‌గాలో అర్థం కాలేదు. అప్పుడు చిరంజీవి గారు గుర్తొచ్చారు. ఆయ‌న‌కు ఫోన్ చేసి నా ప‌రిస్థితి వివ‌రించాను. ల‌క్ష‌, రూ.2 ల‌క్ష‌లు స‌హాయం చేస్తార‌నుకొన్నా. `ఐదు నిమిషాల్లో నీకు అపోలో నుంచి ఫోన్ వ‌స్తుంది. నీ రిపోర్ట్స్ తీసుకుని వెళ్లి జాయిన్ అవ్వు` అన్నారు. అపోలో లో రూ.40 ల‌క్ష‌ల బిల్లువ‌చ్చింది. అదంతా ఆయ‌నే చెల్లించారు'' అంటూ చిరంజీవి త‌న‌కు చేసిన స‌హాయాన్ని గుర్తు చేసుకొన్నారు. దాంతో మ‌రోసారి చిరు దాదృత్వం బ‌య‌ట‌కువ‌చ్చింది. సాధార‌ణంగా ఇలాంటి స‌హాయాలు చేసిన‌ప్పుడు సెల‌బ్రెటీలు మీడియాకు ముందే చెబుతుంటారు. రూ.ల‌క్ష ఇచ్చినా ప్ర‌మోష‌న్ల‌కు వాడుకొంటారు. కానీ చిరు రూ.40 ల‌క్ష‌లు ఇచ్చి కూడా ఏనాడూ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. ఇప్పుడు స‌హాయం తీసుకొన్న‌వాళ్లు బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడితే త‌ప్ప‌.. ఆ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కూ గోప్యంగానే ఉంది. అదీ చిరంజీవి అంటే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS