ప‌వ‌న్ లెక్క‌: 22 రోజుల‌కు 44 కోట్లు

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ పారితోషికం ఎంత‌? టాలీవుడ్ లో ఇది ఎప్ప‌టికీ హాట్ టాపిక్కే. ఆ సినిమాకి అంత తీసుకొన్నాడంట‌, ఈ సినిమాకి ఇంత ఇచ్చార‌ట‌, ప‌వ‌న్ పారితోషికం ఇప్పుడు రోజుల్కెక్క‌నంట‌.. అంటూ ప‌వ‌న్ గురించి టాపిక్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా మాట్లాడుకొంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆ అవ‌స‌రం ఏం లేదు. ఎందుకంటే త‌న పారితోష‌ఙ‌కం ఎంతో.. ప‌వ‌న్ నేరుగా చెప్పేశాడు.

ప్ర‌స్తుతం సాయి ధ‌ర‌మ్ తేజ్ తో చేస్తున్న సినిమాకి 22 రోజుల‌కు గానూ 44 కోట్లు తీసుకొన్నాన‌ని, ఆ లెక్క‌న త‌న పారితోషికం రోజుకి 2 కోట్ల‌ని.. `జ‌న‌సేన‌` ఆవిర్భావ వేదిక‌లో.. ప‌వ‌న్ చెప్పేశాడు. ఇలా త‌న పారితోషికం ఎంతో.. స‌భాముఖంగా చెప్పిన క‌థానాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌డే ఏమో.. హీరోలు భారీ ఎత్తున పారితోషికాలు తీసుకోవ‌డం స‌హ‌జ‌మే. కానీ ఈ విష‌యాన్ని గోప్యంగా ఉంచుతారు. పైగా ఐటీ కి లెక్క చూపించాలి. అందుకే ఈ విష‌యాన్ని బ‌హిరంగ ప‌ర‌చుకోరు.

కానీ ప‌వ‌న్ మాత్రం బ‌హిరంగ స‌భ సాక్షిగా చెప్పేశాడు. ఈ విష‌యంలో ప‌వ‌న్ గ్రేట్ అనుకోవాలి. కాక‌పోతే... ప‌వ‌న్‌కి ఇప్ప‌టి నుంచీ ఐటీ చిక్కులు వ‌స్తాయేమో అన్న‌ది అభిమానుల బాధ‌. అయితే.. ప‌వ‌న్ ఇలాంటి విష‌యాల్లో ప‌క్కాగా ఉంటాడు. ఐటీకి పూర్తిగా వైట్ లోనే లెక్క‌లు చూపించుకొంటాడు. అందుకే ఇంత ధైర్యంగా త‌న పారితోషికం ఇంత‌ని చెప్పేశాడేమో..? మొత్తానికి ప‌వ‌న్ పారితోషికం ఎంతన్న విష‌యంపై ఇక‌పై ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలూ ఉండ‌వేమో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS