ఈ సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు రిలీజ్‌కి రెడీ అయిన సంగతి తెలిసిందే. వాళ్ల సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు కూడా పోటా పోటీగా సాగుతున్నాయి. వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని.. ఈనెల 6న ఒంగోలులో నిర్వహించబోతున్నారు. అదే రోజు ట్రైలర్ కూడా విడుదల చేస్తారని టాక్. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కీ ముహూర్తం ఫిక్సయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వైజాగ్ ఆర్‌కే బీచ్ దగ్గర నిర్వహించబోతున్నారు. ఈనెల 4నే ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదంటే.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే ట్రైలర్ చూపించే ఛాన్స్ ఉంది. హైదరాబాద్‌లో సైతం ఓ ఈవెంట్ నిర్వహించడానికి మైత్రీ మూవీస్ ప్రయత్నాలు చేస్తోంది.
ఆహాలో బాలయ్య అన్ స్టాపబుల్ 2 జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో.. వాల్తేరు వీరయ్య టీమ్ సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే షోలో.. వీర సింహారెడ్డి టీమ్ కూడా కనిపించబోతోందట. అంటే.. ఒకే షోలో రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు జరిగిపోతాయన్నమాట.