ఆర్.ఆర్.ఆర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్‌కి ఎదిగాడు. అయితే... ఆర్.ఆర్.ఆర్ తరవాత.. ఎన్టీఆర్ సినిమా ఏదీ మొదలు కాలేదు. చరణ్ మాత్రం వరుసగా సినిమాలు చేసేస్తున్నాడు.
కొరటాలతో ఎన్టీఆర్ ఓ సినిమా ఓకే చెప్పినా ఇప్పటి వరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలవుతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ డేట్ కూడా వచ్చింది. ఆ రిలీజ్ డేట్ చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. 2024 ఏప్రిల్ 5 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట. అంటే.. 2024లో ఎన్టీఆర్ నుంచి ఏ సినిమా రానట్టే లెక్క. కొరటాల శివ సినిమాల్ని చాలా వేగంగా పూర్తి చేస్తాడు. అయితే... ఈ సినిమాకి మాత్రం ఇంత సమయం తీసుకోవాలనుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆర్.ఆర్.ఆర్ కోసం ఎన్టీఆర్ మూడేళ్లు ఎదురు చూశాడు. ఆర్.ఆర్.ఆర్ తరవాత రెండేళ్ల వరకూ సినిమా రావడం లేదు. ఇంతింత పెద్ద పెద్ద గ్యాప్‌లు ఎన్టీఆర్ లాంటి హీరోలకు సరి కాదన్నది అభిమానుల అభిప్రాయం. నిజానికి.. బుచ్చిబాబు కథని సైతం ఓకే చేసి, రెండు సినిమాల్నీ సమాంతరంగా పట్టాలెక్కించాలని ఎన్టీఆర్ ప్లాన్ చేశాడు. అయితే అనూహ్యంగా బుచ్చిబాబు కథని పక్కన పెట్టేశాడు. కేవలం కొరటాల సినిమాపైనే ఫోకస్ చేశాడు. అయితే... కొరటాల సినిమా కోసం ఇంత సమయం కేటాయించడం మాత్రం అభిమానులకు మింగుడు పడడం లేదు.