మెగాస్టార్ చిరంజీవి, కళాతపస్వి విశ్వనాధ్‌ని కలిశారు. ఆయనకు 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు దక్కినందుకు చిరు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆయన డైరెక్షన్‌లో పలు చిత్రాల్లో నటించారు చిరంజీవి. దర్శకత్వంలో విశ్వనాధ్‌ది ఓ డిఫరెంట్ పంథా. హీరో వయసుతో సంబంధం లేదు. హీరోయిన్ గ్లామర్ అసలే అవసరం లేదు. కానీ సినిమా మాత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. అలాంటిదే 'శంకరాభరణం' చిత్రం. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే ఇదో అద్భుత కావ్యం అయ్యింది. అలాంటివి ఎన్నో చిత్రాలు ఈయన నుండి వచ్చినవి. ఇక చిరంజీవి విషయానికి వస్తే 'శుభలేఖ', 'స్వయం కృషి', ఆపద్భాంధవుడు' తదితర చిత్రాల్లో నటించారు కళాతపస్వి విశ్వనాధ్ డైరెక్షన్‌లో చిరంజీవి. కమర్షియల్‌గా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న ఆ టైంలోనే చిరంజీవి విశ్వనాథ్‌తో సినిమాలు అడిగి మరీ చేసేవారు. అంత గొప్ప డైరెక్టర్ ఆయన. ఆయనంటే చిరంజీవికి చాలా అభిమానం. అలాగే చిరంజీవి అంటే విశ్వనాధ్‌కి ఎంతో అభిమానం. ఈ అవార్డు ఆయనకి దక్కడం నిజంగా చాలా గొప్ప విషయం అని చిరంజీవి అన్నారు. అసలు ఈ అవార్డు ఆయనకి ఎప్పుడో రావాల్సింది. ఈ అవార్డు ఆయన్ని వరించడం ఆ అవార్డుకు ఉన్న గౌరవం మరింత రెట్టింపయ్యింది అని చిరంజీవి అన్నారు.