కొత్త సినిమా వచ్చిందంటే చాలు. టికెట్స్ కోలాహలం స్టార్ట్ అయిపోతుంది. ఆన్ లైన్‌లో టికెట్స్ ఆల్రెడీ బుకింగ్స్. ఆన్‌లైన్‌లో టిక్‌ట్స్ బుక్ చేస్తున్నారా? అయితే కొంచెం ఆలోచించండి. ఇంతవరకూ ఆన్‌లైన్ బుకింగ్స్ అంటే ఓకే. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ శుక్రవారం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలుగు సినిమా 'బాహుబలి ది కన్‌క్లూజన్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసమే ఈ హడావిడి అంతా. ఆన్‌లైన్ టికెట్స్ పేరిట ఇప్పుడు ఫేక్ టికెట్స్ వచ్చేశాయి. ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేస్తుంటే, కన్‌ఫామేషన్ మెసేజ్ వస్తుంది ఫోన్‌కి. ఇంకేముంది మాకు టికెట్స్ వచ్చేశాయోచ్ అంటూ ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. కానీ అందులో ఏది నిజమైన టికెటో, ఏది ఫేక్ టికెటో తెలీని పరిస్థితి. కొందరు అసాంఘిక శక్తులు ఈ రకమైన ఆన్‌లైన్ మోసానికి పాల్పడుతున్నారు. 'బాహుబలి' సినిమా పేరు చెప్పి ఇలా క్యాష్ చేసుకుంటున్నారు. ఈ తరహా టికెట్ బుకింగ్ వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. కానీ ఏది ఫేక్ టికెట్టో, ఏది పర్‌ఫెక్ట్ టికెట్టో తెలుసుకొనేది ఎలా అంటూ ఆడియన్స్ సందిగ్ధంలో ఉన్నారు. ఈ విషయంపై బాధ్యత ఎవరు తీసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో కూడా ఎవ్వరికీ తెలీడం లేదు. ధియేటర్స్‌కి వెళితే, బ్లాక్ టికెట్స్ గోల. ఆన్‌లైన్‌లో అయితే ఈ ఫేక్ టికెట్స్ గోల.. 'బాహుబలి' కి ఇదేం కొత్త గోల..చెప్మా!