'బెస్ట్‌ పిక్‌ ఆఫ్‌ 2020' ఏంటో తెలుసా?

మరిన్ని వార్తలు

కొత్త సంవత్సరంలో 'మా' డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ డైర ఆవిష్కరణలో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. రాజశేఖర్‌ దురుసు ప్రవర్తన ఈ కార్యక్రమంలో కొంత రసాభాస అయినా, ఇదే స్టేజ్‌పై లెజెండ్స్‌ మెగాస్టార్‌ చిరంజీవి, మోహన్‌బాబుల మధ్య అనుబంధం అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించింది. చిరు, మోహన్‌బాబు మధ్య కూడా ఏవో గొడవలున్నాయంటూ అప్పుడప్పుడూ వార్తలు ప్రచురితమవుతుండడం తెలిసి నంగతే.

 

కానీ, కొత్త సంవత్సరంలో జరిగిన ఈ కార్యక్రమం వేదికగా, మోహన్‌బాబు మాట్లాడుతూ, చిరుతో తనకెలాంటి విబేధాల్లేవ్‌ అనీ, తామిద్దరం కళామతల్లి ముద్దు బిడ్డలమనీ చెబుతుండగా, చిరంజీవి వెనక నుండి వచ్చి మోహన్‌బాబును ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, ముద్దు పెట్టారు. ఇప్పుడీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మోహన్‌బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్‌లు ఈ ఫోటోలపై సోషల్‌ మీడియాలో స్పందించారు. 'ఈ ఇద్దరు లెజెండ్స్‌ని ఇలా చూస్తుంటే మాకెంతో సంతోషంగా ఉంది. అసలైన గ్యాంగ్‌స్టర్స్‌ వీళ్లే. వీళ్ల స్నేహం మాకెంతో స్పూర్తిదాయకం..' అంటూ మంచు విష్ణు స్పందించగా, 'ఫోటో ఆఫ్‌ ది డికేడ్‌' అంటూ మంచు మనోజ్‌ పోస్ట్‌ చేశాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS