దర్శకుడిగా అపజయం అంటూ లేకుండా వరుసగా నాలుగు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ. ఈయన నుండి తాజాగా వచ్చిన భరత్ అనే నేను చిత్రం రికార్డులని తిరగరాస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోయింది.
ఇక ఇవ్వని పక్కనపెడితే, ఈయన సక్సెస్ రేట్ చూసి మెగా క్యాంప్ నుండి ఒక మెగా ఆఫర్ వచ్చినట్టుగా ఇప్పుడు ఫిలిం నగర్ లో ఒక వార్త హల్చల్ చేస్తున్నది. ఆ వార్త ప్రకారం, కొరటాల శివ ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి ని కలిసి ఒక స్టొరీ లైన్ చెప్పినట్టు, అది ఆయనకి బాగా నచ్చడంతో వెంటనే కథని సిద్ధం చేయమని చెప్పాడట, ప్రస్తుతం కొరటాల అదే పనిలో ఉన్నాడట.
అన్ని కుదిరితే, చిరు-కొరటాల సినిమా ఈ సంవత్సరం చివరలో మొదలవుతుంది అని అంటున్నారు. అయితే ఒక్కసారి ఈ వార్తని గమనిస్తే, అసలు ఈ కలయికలో ఇప్పటికిప్పుడు సినిమా వస్తుందా అన్న అనుమానాలు లేకపోలేదు. కారణమేంటంటే- చిరంజీవి సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు, తన పాత్ర అలాగే సినిమా మొత్తాన్ని కూడా చాలా పకడ్బందిగా తెరకెక్కిస్తున్నారు. అందుకనే, ఈ షూటింగ్ అనుకున్న సమయం కన్నా కొంచెం ఎక్కువే పట్టొచ్చు అని అంటున్నారు.
దీనితో ఈ సంవత్సరం మొత్తం ఈ చిత్రానికే సరిపోతుంది, ఇలాంటి తరుణంలో కొరటాల శివ సినిమా అనేది ఒక ప్రశ్న అనే చెప్పాలి. ఒక వేళ మొదలైనా కూడా అది వచ్చే ఏడాది అని మాత్రం చెప్పొచ్చు.