బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్నాడు హీరో ప్రభాస్, ఇక ఈ క్రేజ్ ఎంతవరకు వెళ్ళిందంటే, తెలుగులో ఉన్న టాప్ హీరోలని వెనక్కినేట్టేసేంతాలా..
ఆ వివరాల్లోకి వెళితే, మోస్ట్ డిజైరబుల్ 2017కి అంతర్జాలంలో ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించగా, ప్రభాస్ తన తోటి హీరోలని అలాగే పోయిన ఏడాది టాప్ లో వచ్చిన మహేష్ ని సైతం కాదని ముందు నిలిచాడు. ఆ ఓటింగ్ లెక్కల ప్రకారం, ప్రభాస్ కి 2వ ర్యాంక్ రాగ మహేష్ కి 6వ ర్యాంక్ వచ్చింది.
అలాగే బిగ్గెస్ట్ హీరో ఎవరు అనే ప్రశ్నకి దాదాపు 50 శాతం పైనే ప్రభాస్ కి మద్దతుగా ఓటింగ్ చేశారు. దీనితో అందరి హీరోలని వెనక్కి నెట్టి ప్రభాస్ ముందు వరుసలో నిలబడ్డాడు. ఇదిలావుండగా ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్నది.
ఏదేమైనా.. బాహుబలి తో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు అన్నది మాత్రం నిజం.