చిరంజీవి ప్రధాన పాత్రలో 'లూసిఫర్' రీమేక్ తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమిళంలో మోహన్‌లాల్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ కమర్షియల్ హంగులకు కాస్త దూరంగానే ఉంటుంది. కానీ, తెలుగు విషయానికి వస్తే, కమర్షియల్ హంగులు తప్పనిసరి. అయితే, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో కొన్ని కొన్ని మార్పులు చేయడం జరిగిందట. దాంతో పాటు, కమర్షియల్ హంగుల విషయంలోనూ దర్శకుడికి చిరంజీవి కొన్ని సూచనలిచ్చారట.
మెగాస్టార్ చిరంజీవి అంటే, హీరోయిన్‌తో సాంగ్స్, డాన్సులు ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ, ఈ సినిమాలో వాటిని కాస్త దూరం పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే, లీడ్ రోల్ మెగాస్టార్ పాత్రకి సపోర్టింగ్‌గా మరి కొన్ని క్యారెక్టర్స్ ఈ సినిమాలో కీ రోల్ పోషించాయి. ఆయా పాత్రల కోసం పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఒరిజినల్ వెర్షన్‌లో పృధ్వీరాజ్, వివేక్ ఒబెరాయ్ తదితర స్టార్స్ పోషించిన పాత్రలను తెలుగులో ఎవరు పోషిస్తారన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, హీరోయిన్‌గా నయన తార పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 'తనీ ఒరువన్' ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ బాణీలు సమకూరుస్తున్నారు.