'గ్యాంగ్ లీడర్' సినిమాతో డెబ్యూ చేసిన ముద్దుగుమ్మ ప్రియాంక మోహనన్ వరుస అవకాశాలతో బిజీ అయిపోతోంది. తెలుగులో ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న 'శ్రీకారం' సినిమాలో ప్రియాంక నటిస్తోంది. లంగా వోణీల్లో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది ప్రియాంక 'శ్రీకారం' ప్రోమోస్‌లో. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, పాప క్యూట్ అప్పియరెన్స్‌కే కాదు, యాక్టింగ్ టాలెంట్‌కీ ఫిదా అయిపోతున్న మన దర్శక, నిర్మాతలు పెద్ద పెద్ద ప్రొపోజల్స్ తీసుకొస్తున్నారట.
త్వరలోనే ఓ బిగ్ హీరో సినిమాలో ప్రియాంక నటించబోతోందని సమాచారం. ఇదిలా ఉంటే, ఆల్రెడీ తమిళంలో ఓ బిగ్ ప్రాజెక్ట్‌ని సొంతం చేసుకుందీ 'గ్యాంగ్ లీడర్' బ్యూటీ. కోలీవుడ్‌లో వన్ ఆఫ్ ది స్టార్ హీరో అయిన సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే యంగ్ హీరో శివ కార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటించింది. పాప వరుస చూస్తుంటే, ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసే సత్తా పుష్కలంగా ఉందనిపిస్తోంది. ఇంతవరకూ యంగ్ హీరోస్‌తోనే స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రియాంక ఇకపై స్టార్ హీరోలతోనూ ఆడి పాడేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
ఇదే జోరులో కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచిందంటే, కెరీర్‌లో ఇక వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదని సినీ నిపుణులు అమ్మడికి సలహాలిచ్చేస్తున్నారట. చూడాలి మరి, ఆ సలహాలు, సూచనలు పాఠించి ప్రియాంక తన కెరీర్‌ని బెస్ట్ వేలో ఎలా బిల్డప్ చేసుకుంటుందో.