టైటిల్ పై చిన్న క్లారిటీ. ఇది లూసిఫర్ సినిమా గురించి. మలయాళ సూపర్ హిట్‘లూసిఫర్’ ని మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన సంగతి తెలిసింది. ‘లూసిఫర్’ చూసిన ప్రేక్షకులకు కధపై ఓ ఐడియా వుంటుంది. బైబిల్, క్రిస్టియానిటీ ఫిలాసఫి అండర్ ప్లే లో సాగే సినిమా ఇది. దానికి పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాని యాడ్ చేసిన కధ ‘లూసిఫర్’.
ఇప్పుడు ‘లూసిఫర్’ ని తెలుగీకరించినపుడు ఎదురయ్యే మొదటి సమస్య మతం. మలయాళంలో క్రిస్టియానిటీ మెజారిటీ గురించి చెప్పనవసరం లేదు. సో .. అక్కడ అదే కరెక్ట్. కానీ తెలుగులో వచ్చేటప్పటి ఆ కధని యధాతదంగా తీసుకోవడం రిస్క్ తో కూడుకున్న పని. అందుకే ఇక్కడ మతం మార్చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు యూనిట్ సభ్యుల ద్వార తెలిసింది. బైబిల్, ఖురాన్, భగవద్గీత.. అల్టీమేట్ గా ఒకే ఫిలాసఫీ చెబుతాయి. ఆ పాయింట్ ప్రకారం .. ‘లూసిఫర్’ని ఇక్కడ మెజారిటీ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతున్నాయని భోగట్టా. ఏదేమైనా ‘లూసిఫర్’ స్క్రిప్ట్ ని డీల్ చేయడం టఫ్ టాస్కే. ఈ ఏడాది ఆఖరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.