ఇండ్రస్ట్రీలో హిట్టు మాటే చెల్లుబాటు అవుతుంది. చేతిలో హిట్ ఉంటేనే అవకాశాలు వస్తాయి. హీరోల చుట్టూ దర్శకులు, దర్శకుల చుట్టూ హీరోలు, వీరిద్దరి వెనుక నిర్మాతలూ పరుగులు తీసేది అందుకే. ఓ ఫ్లాప్ పడితే జాతకాలు తారుమారు అయిపోతాయి. తాజాగా.. ఇంద్రగంటి మోహన కృష్ణ పరిస్థితి ఇంతే. `వి` తరవాత.. ఇంద్రగంటితో సినిమాలు చేయడానికి ఇద్దరు హీరోలు రెడీ అయ్యారు. ఒకరు... విజయ్ దేవరకొండ, మరొకరు నాగచైతన్య. వీరిద్దరితో.. ఇంద్రగంటి సినిమాలు ఎప్పుడో ఫిక్సయ్యాయి. కానీ... `వి` తరవాత.. ఎవరి సినిమా పట్టాలెక్కుతుందో తెలీలేదు.
అయితే... ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలూ.. ఇంద్రగంటికి హ్యాండిచ్చినట్టు సమాచారం. దానికి కారణం `వి` ఫలితమే. ఇటీవల ఓటీటీలో విడుదలైన `వి` డిజాస్టర్ గా మిగిలింది. ఏ వర్గాన్నీ మెప్పించలేకపోయింది. అదంతా.. ఇంద్రగంటి వైఫల్యమే అనేది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఇంత భారీ డిజాస్టర్ తరవాత.. ఇంద్రగంటితో సినిమా చేయడం రిస్కే. అందుకే విజయ్, చైతూ.. ఇద్దరూ సైడ్ అయిపోయినట్టు భోగట్టా. ఇప్పుడు అర్జెంటుగా ఇంద్రగంటి ఓ హీరోని వెదుక్కోవాలి. తనదైన మార్క్ చూపిస్తూ ఓ సినిమా తీసి హిట్టు కొట్టాలి. అప్పుడు గానీ, ఈ ఇద్దరు హీరోలూ మళ్లీ తిరిగి రారు.