ప్రస్తుతం `ఆచార్య`గా ముస్తాబవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కరోనా సెకండ్ వేవ్ అడ్డొచ్చింది గానీ, లేదంటే ఈపాటికి `ఆచార్య` విడుదలైపోయి... చిరు `లూసీఫర్` రీమేక్‌లో పడిపోదును. కరోనా వల్ల `ఆచార్య`... `లూసీఫర్` రెండూ ఆలస్యమైపోయాయి. అయితే `లూసీఫర్`కి సంబంధించిన పనులన్నీ చక చక సాగిపోతున్నట్టు టాక్. పరిస్థితులు చక్కబడిన వెంటనే `ఆచార్య` షూటింగ్ ప్రారంభమైపోతుందని దర్శకుడు కొరటాల శివ ఇది వరకే ప్రకటించాడు.
`ఆచార్య` ముగిసిన వెంటనే.. `లూసీఫర్` పట్టాలెక్కుతోంది. లూసీఫర్ రీమేక్ లో మార్పులు చేర్పులూ చేసి, దర్శకుడు మోహన్ రాజా స్క్రిప్టు ని రెడీగా ఉంచాడు. ఈచిత్రానికి `రారాజు`, `కింగ్ మేకర్` లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయని వార్తలు బయటకు వచ్చాయి. చిరంజీవి `కింగ్ మేకర్` టైటిల్ పై ఆమోద ముద్ర వేసినట్టు టాక్.
ఈ చిత్రంలో కథానాయికగా నయనతార పేరు వినిపిస్తోంది. ఆమె కూడా దాదాపుగా ఖాయమయ్యే సూచనకలు కనిపిస్తున్నాయి. `ఆచార్య` ఓ కొలిక్కి వచ్చిన వెంటనే.. లూసీఫర్ రీమేక్ టైటిల్, హీరోయిన్ పై ఓ అధికారిక ప్రకటన రావొచ్చు.