మెగాస్టార్ అంటేనే మనసులో అదో రకమైన వైబ్రేషన్స్. పెద్దవాళ్లకే కాదు, పిల్లకు కూడా అంతే. ఆ వైబ్రేషన్స్ అలానే ఉంటాయి. తాజాగా ఆయన బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న మెగా గేమ్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాంలో చిచ్చర పిడుగులు సందడి చేస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా చిన్న పిల్లలు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం చాలా చాలా సరదాగా సాగిపోతోంది. పెద్ద వాళ్లని కాదు, చిన్న పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఆరు పదుల వయసులో చిరంజీవి జస్ట్ పదులలోపు వయసు పిల్లాడిలా మారిపోయి ఆ పిల్లలతో కలిసిపోతున్నారు. దాంతో ఈ ప్రోగ్రాంలో పిల్లలు అస్సలు తడబడకుండా, కొంచెం కూడా బెరుకు లేకుండా, హాట్ సీట్లో కూర్చొని ఆడుతూ పాడుతూ గేమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మామూలుగా ఇలాంటి ప్రోగ్రాంస్కి పిల్లలు చాలా టెన్షన్‌కి గురౌతూ, ఒత్తిడి ఫీలవుతారు. కానీ ఈ ప్రోగ్రాంలో చిరంజీవిని చూస్తూ హాయిగా ఆడేస్తున్నారు. అదంతా చిరంజీవి క్రెడిటే. చిన్న పిల్లల్లో చిన్నపిల్లాడిలా మెగాస్టార్ కలిసిపోవడంతోనే అది సాధ్యమవుతోంది. తన స్టార్‌డమ్‌ని పక్కన పెట్టేసి పిల్లలతో కలిసి చిందేస్తున్నారు చిరు. పిల్లలు కూడా అంతే యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంతో ఈ ప్రోగ్రాం పిల్లలతో మరింత సందడిగా మారింది. మరో వైపు చిరంజీవి త్వరలోనే 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' సినిమాలో నటించనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.