అందరూ జాగ్ర‌త్త‌గా ఉండండి: చిరంజీవి

మరిన్ని వార్తలు

క‌రోనా క్రైసిస్ చారిటీని ప్రారంభించి ఈ క‌ష్టకాలంలో ఆదుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త‌పై ప్ర‌జ‌ల్ని జాగ్రత్తగా ఉండాలంటూ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు.

 

ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. ``క‌రోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. చాలామంది వైర‌స్ బారిన ప‌డి ప్రాణాలతో పోరాడుతున్నారు. కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతోంది. వైర‌స్ వ‌ల్ల‌ మ‌న ఆత్మీయుల్ని కోల్పోతున్నామంటే గుండె త‌రుక్కుపోతోంది. ఈ త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ లాక్ డౌన్ వేశారు. క‌నీసం ఇప్పుడైనా అల‌క్ష్యం చేయ‌కుండా ఉండండి.. ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్దు.అత్యవసరమై బయటికి వచ్చినపుడు తప్పకుండా మాస్క్ ధ‌రించండి. వీలైతే డ‌బుల్ మాస్క్ ధ‌రించండి. లాక్ డౌన్ లో కూడా వ్యాక్సినేష‌న్ సాగుతోంది.

 

రిజిస్ట్రేష‌న్ చేసుకుని అంద‌రూ వ్యాక్సినేష‌న్ తీస్కోండి. ఆ త‌ర్వాత క‌రోనా పాజిటివ్ వ‌చ్చినా ప్ర‌భావం త‌క్కువ‌. కోవిడ్ పాజిటివ్ వ‌చ్చినా ప్యానిక్ అవ్వ‌కండి. వైర‌స్ కంటే మ‌న భ‌యమే మ‌న‌ల్ని ముందుగా చంపేస్తోంది. క‌రోనా పాజిటివ్ అని తెలియానే ఐసోలేష‌న్ కి వెళ్లండి. మిమ్మ‌ల్ని మీరు వేరు చేసుకోండి. డాక్ట‌ర్ ని సంప్రదించండి. మందులు వాడండి. ఊపిరి స‌మ‌స్య త‌లెత్తితే వెంట‌నే ఆస్ప‌త్రిలో చేరండి.. క‌రోనా చికిత్స పొందిన త‌ర్వాత నెల‌రోజుల్లో యాంటీబాడీస్ త‌యార‌వుతాయి. మీరు ప్లాస్మా దానం చేస్తే ఒక్కొక్క‌రు మ‌రో ఇద్ద‌రిని కాపాడిన వారు అవుతారు. ఈ విప‌త్తు స‌మ‌యంలో వీలైనంత మందికి ఈ విష‌యం చెప్పండి. మ‌న‌ల్ని మ‌నం కాపాడుకుంటే దేశాన్ని ర‌క్షించిన వాళ్లం అవుతాం. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని సుర‌క్షితంగా ఉండండి`` అని ప్ర‌జ‌ల్ని కోరారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS