చిరంజీవి టీజర్‌ రిలీజ్‌కి ఎందుకు రాలేదంటే.!

మరిన్ని వార్తలు

సంక్రాంతి, దీపావళి, దసరా, క్రిస్‌మస్‌, రంజాన్‌.. ఇలా తెలుగు వారి పండగలు ఎన్నున్నాయో అన్ని పండగలు ఒకేసారి కలిసొస్తే ఎలా ఉంటుంది? ఊహించడం కష్టమే కదా. కానీ నిజమై కనిపించింది. అదే 'సైరా నరసింహారెడ్డి' టీజర్‌ రిలీజ్‌తో. ఒకరోజు ముందే చిరంజీవి పుట్టినరోజు వేడుకలు స్టార్ట్‌ అయిపోయాయి. అంచనాలను మించి మెగాస్టార్‌ 'సైరా' టీజర్‌ రిలీజైంది. 

అభిమానుల ఆనందానికి అవధుల్లేవు అన్న మాట చాలా చిన్నది. ఇది టీజర్‌ కాదు, సినిమా అనే టాక్‌ వినిపిస్తోంది. సినిమా చూసేసినంత థ్రిల్‌ని, ఫీల్‌ని కలిగించింది 'సైరా' టీజర్‌. చిరంజీవిని తెరపై ఎలా చూడాలనుకున్నారో అచ్చం అలాగే చూపించడంలో సురేందర్‌ రెడ్డి సక్సెస్‌ అయిపోయాడు టీజర్‌ లుక్‌తోనే. చిరంజీవి పుట్టినరోజుకు ఒక రోజు ముందే సైరా టీమ్‌ అభిమానులకు ఈ సర్‌ప్రైజ్‌నిచ్చింది. అలాగే ఇది చిరంజీవికి సైరా టీమ్‌ ఇస్తున్న బర్త్‌డే గిఫ్ట్‌ కూడా. 

ఇద్దరు మాతృమూర్తుల సమక్షంలో ఈ టీజర్‌ విడుదలైంది. మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనమ్మ, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ తల్లి సురేఖల సమక్షంలో 'సైరా' టీజర్‌ని లాంఛ్‌ చేశారు. తల్లికి ఆశీర్వాదానికి మించిన ఆశీర్వాదం ఇంకేముంటుందీ లోకంలో. అయితే టీజర్‌ రిలీజ్‌కి చిరంజీవి రాలేదు. 

అదే మాట ఓ విలేఖరి చరణ్‌ని ప్రశ్నించగా, ఆయన బర్త్‌డే గిఫ్ట్‌ ఆయనే దగ్గరుండి చూసేస్తే ఏం బావుంటుంది. ఇది మనం ఆయనకిచ్చే బర్త్‌డే గిఫ్ట్‌.. సో అందుకే ఆయన రాలేదు అని చాతుర్యంగా చరణ్‌ సమాధానమిచ్చాడు. ఏది ఏమైనా చిరంజీవి బర్త్‌డే గిఫ్ట్‌ సూపరో సూపర్‌ అంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS