తన బయోపిక్ తానే తీస్తాను అంటున్న శ్రీరెడ్డి

మరిన్ని వార్తలు

సంచలనాలకి కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీ రెడ్డి ఇప్పుడు ఏకంగా తన జీవితాన్నే ఆధారం చేసుకుని ఒక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్టు ఒక ప్రకటన చేసింది.

ఆ వివరాల్లోకి వెళితే, నిన్న చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా 'రెడ్డి డైరీ' అనే చిత్రాన్ని రూపొందించనున్నారట. ఈ చిత్రానికి అల్లావుద్దీన్ అనే దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ చిత్రానికి తమ పూర్తి సహకారాన్ని ఇస్తామని నడిగర్ సంఘం నుండి తమకి హామీ దక్కిందని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

ఇదే సమయంలో తనని అవకాశాల కోసం వాడుకున్న వారి పైన తన పోరాటం ఆగదని, ఒక్కొక్కటిగా వాటికి సంబంధించిన రుజువులు బయటపెడతాను అని తెలిపింది.

హైదరాబాద్ కేంద్రంగా తాను చేస్తున్న ఆరోపణలకి స్పందన రావడంలేదు అని అనుకుందో ఏమో తెలియదు కాని ప్రస్తుతం ఆమె చెన్నై కేంద్రంగా తన ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS