మెగాస్టార్... గుండు టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎప్పుడూ లేనిది చిరంజీవి గుండుతో కనిపించడంతో... ఆయన ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. చిరు ఏంటి? ఈ లుక్కేంటి? అంటూ ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇదంతా చిరు కాలక్షేపం కోసమో, సరదా కోసమో చేయలేదని టాక్. త్వరలోనే చిరు ఓ సినిమాలో ఇలానే గుండుతో కనిపించబోతున్నారని, ఇది టెస్ట్ లుక్ అని తెలుస్తోంది.
చిరు ప్రస్తుతం ఆచార్యలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరవాత మెహర్ రమేష్. బాబి, వినాయక్ సినిమాలలో నటించబోతున్నారు. ఈ సినిమాలో ఓ పాత్ర గుండుని డిమాండ్ చేస్తోందట. అందుకే ఆ లుక్ ఎలా ఉంటుందో అని చిరు ట్రై చేసినట్టు సమాచారం. బాబి చెప్పిన కథలో ఈ గుండు లుక్ ఉందని, అందుకే ఆయన సరదాగా ట్రై చేశారని చెప్పుకుంటున్నారు. మొత్తానికి చిరు గుండు గురించి అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. మరి తెరపై ఈ లుక్ లో ఆయన ఎప్పుడు కనిపిస్తారో చూడాలి.