ప్రస్తుతం `ఆచార్య`గా అలరించడానికి సిద్ధమవతున్నాడు చిరంజీవి. చిరు నటిస్తున్న 152వ సినిమా ఇది. ఆ తరవాత.. మరో రెండు ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. తమిళ సూపర్ హిట్ చిత్రం `వేదాళం` రీమేక్ బాధ్యతలు మెహర్ రమేష్‌కి అప్పగించాడు చిరు. ఈ స్క్రిప్టు ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది. మరోవైపు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా మొదలైపోయింది. ఈ రీమేక్ లో చిరు చెల్లాయిగా సాయిపల్లవిని ఎంపిక చేసినట్టు సమాచారం. `వేదాళం`లో చాలా కీలకమైన పాత్ర ఇది.
ఈ పాత్ర చేయడానికి ఇమేజ్ తో పాటు, నటనలో సమర్థత ఉన్న నటి కావాలి. అందుకే మరో మాట లేకుండా... సాయి పల్లవిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించడానికి సాయి పల్లవి కూడా అంగీకరించిందట. ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాతో బిజీగా ఉంది సాయి పల్లవి. మరో నాలుగైదు రోజులు షూటింగ్ జరిపితే... సినిమా పూర్తయిపోతుంది. చిరు చేతిలో `లూసీఫర్` రీమేక్ కూడా ఉంది. అయితే ఈ రెండు రీమేక్‌లలో ఏది ముందు మొదలవుతుందో చిరునే చెప్పాలి.