చిరంజీవికి చాలాకాలంగా సొంత నిర్మాణ సంస్థ లేదు. ఒకప్పుడు అంజనా ప్రొడక్షన్స్ ఉండేది. నాగబాబు అప్పుడప్పుడూ సినిమాలు చేసేవారు. గీతా ఆర్ట్స్ వచ్చాక.. సొంత నిర్మాణ సంస్థ అవసరమే లేకుండా పోయింది. అల్లు అరవింద్‌తో కలసి ఎన్నో చిత్రాల్ని పట్టాలెక్కించారు. సూపర్ హిట్లు కొట్టారు. ఓ రకంగా చాలా సందర్భాల్లో గీతా ఆర్ట్స్ చిరుకి వెన్నెముకలా నిలిచింది. చాలా సార్లు గీతా ఆర్ట్స్‌ని చిరు నిలబెట్టారు. అలా.. చిరు అంటే గీతా, గీతా అంటే చిరు అనేలా సాగింది ఆ ప్రయాణం.
చిరు రీ ఎంట్రీ కూడా గీతా ఆర్ట్స్‌లో ఉండాలని అల్లు అరవింద్ అనుకున్నారు. కానీ చరణ్ అడ్డుపడ్డాడు. చిరు రీ ఎంట్రీ సినిమా అంటే మామూలు విషయం కాదు. అన్నీ పక్కాగా కుదిరితే రికార్డులన్నీ బద్దలు కొట్టి తీరుతుంది. కాబట్టి.. తెలివిగా ఆసినిమాని తన జేబులో వేసుకున్నాడు చరణ్.
చిరు 151 సినిమా మాత్రం తానే తీస్తానని.. అప్పట్లోనే చెప్పారు అరవింద్. కానీ ఆ అవకాశం కూడా చరణ్ ఇవ్వలేదు. చిరు 151 కూడా చరణ్ ఖాతాలోనే పడిపోయింది. కాస్త ముందు జాగ్రత్తతో ఆలోచించిన అరవింద్... చిరంజీవి 152వ సినిమాపై కర్చీఫ్ వేసేశాడు. అందుకోసం బోయపాటి శ్రీనుకి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. అన్నీ కుదిరితే... సైరా తరవాత చిరు గీతా ఆర్ట్స్‌లోనే సినిమా చేయాలి. అయితే... అల్లు అరవింద్ నిరీక్షణ ఇప్పట్లో తీరేట్టు కనిపించడం లేదు.
ఎందుకంటే.. `సైరా` తరవాత చిరు కొరటాల శివతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాకే గీతా ఆర్ట్స్లో సినిమా ఉంటుంది. బోయపాటి శ్రీను కూడా ఈలోగా అఖిల్ సినిమా పూర్తి చేస్తాడు. సో... చిరు పోస్టర్‌పై గీతా ఆర్ట్స్ బ్యానర్ పేరు కనిపించాలంటే కనీసం మరో రెండేళ్లయినా ఆగాల్సిందే. ఈలోగా ఎన్ని సమీకరణాలు మారతాయో, ఏంటో?