అమీర్ ఖాన్ నటించిన చిత్రం `లాల్ సింగ్ చద్దా`. ఇందులో నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అమీర్‌కి దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. అందుకే తెలుగులోనూ ఈ సినిమాని భారీగా విడుదల చేద్దామని భావిస్తున్నాడు అమీర్ ఖాన్. అందుకే ఇక్కడ ప్రమోషన్ల కోసం భారీ ప్లానింగ్ వేస్తున్నాడు. ఇటీవల చిరంజీవి, రాజమౌళిల కోసం ప్రత్యేకంగా ఈ సినిమా ప్రీమియర్‌ని ఏర్పాటు చేశాడు. అంతే కాదు.. ఇప్పుడు ఈ సినిమాకి చిరంజీవిని సమర్పకుడిగా మార్చేశాడు.
తెలుగులో `లాల్ సింగ్ చద్దా`కు చిరు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. చిరు ఇన్నేళ్ల కెరీర్‌లో ఓ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఈ సినిమా చూసిన తరవాత చిరంజీవి భావోద్వేగానికి గురయ్యాడని, ఇంత మంచి సినిమాలో తాను భాగం పంచుకోవాలనుకుంటున్నట్టు అమీర్ ఖాన్‌తో చెప్పాడని, దాంతో అమీర్ `ఈ చిత్రానికి మీరు తెలుగులో సమర్పకుడిగా వ్యవహరించండి` అని అడిగాడని, దానికి చిరు ఒప్పుకొన్నాడని తెలుస్తోంది. ఈ సినిమా ప్రచారంలో రాజమౌళి కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఎందుకంటే అమీర్‌ఖాన్, రాజమౌళిల మధ్య మంచి అనుబంధం ఉంది.
ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్లలో అమీర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. త్వరలోనే అమీర్ - రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా కూడా తెరకెక్కే అవకాశం ఉంది.