అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల ఏజెంట్ టీజర్ బయటికి వచ్చింది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా టీజర్ ని కట్ చేశారు.
నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీహెడ్ మహదేవ్ పాత్ర పోషిస్తున్న మమ్ముట్టిని విచారిస్తుండగా.. అతను ఏజెంట్ క్యారెక్టర్ గురించి పవర్ ఫుల్ గా వివరించడం ఆసక్తికరంగా వుంది. అతన్ని పట్టుకోగలమా ? అని ఓ ఆఫీసర్ అడిగితే.. ''నో హీఈజ్ అన్ ప్రిడిక్టబుల్. నో విట్నేస్, నో ఫారిన్సిక్ ఎవిడెన్స్. అతని డెత్ నోట్ ఆల్రెడీ రాసుంది'' అని మమ్ముటి చెప్పడం ఇంట్రస్టింగా వుంది.
మహదేవ్ పాత్ర చెప్పినట్లే టీజర్ అఖిల్ యాక్షన్ వీర లెవల్ లో వుంది. చావుకు భయపడిన ఏజెంట్ పాత్రలో కనిపించారు అఖిల్. టీజర్ చివరి అతని చంపని అరిచే సీక్వెన్స్ మాస్ కి నచ్చేలా వుంది. టీజర్ హీరోయిన్ కి కూడా చోటు దక్కింది. హిప్ హాప్ తమిజా అందించిన నేపధ్య సంగీతం కూడా బావుంది. మొత్తానికి ఏజెంట్ టీజర్ ఇంప్రసీవ్ గా వుంది. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు.