రాజకీయాల నుండి విరామం తీసుకున్న చిరంజీవి ప్రస్తుతం సినిమాలపై దృష్టి నిలిపాడు. అందులో భాగంగానే ఆయన పలువురు దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఇక ఈ తరుణంలోనే ప్రముఖ నిర్మాత అయిన టీ సుబ్బిరామిరెడ్డి ఆమధ్య ఒక మెగా మల్టీస్టారర్ చిత్రం చేయనున్నట్టు అందులో చిరంజీవి-పవన్ కళ్యాణ్ ఉండబోతున్నట్టు ప్రకటించాడు. దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారు అన్నది కొసమెరుపు.
అయితే ఆ ప్రాజెక్ట్ గురించి తరువాత ఎటువంటి సమాచారం లేకపోయినప్పటికీ గత రెండు మూడు రోజుల నుండి ఆ చిత్రానికి సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతున్నది. ఆ వార్త సారాంశమేమిటంటే- ఆ చిత్రంలో పవన్ కేవలం ఒక 30 నిమిషాలు మాత్రమే కనిపించనున్నాడట.
దీనితో మెగా అభిమానుల్లో ఒక్కసారిగా ఈ చిత్రం పైన అంచనాలు పెరిగి పోయాయి. అయితే దీని పైన ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.