పెద్ద ఎన్టీఆర్ హైదరాబాద్ కి తరలి వచ్చే ముందు చెన్నైలో ఆయన నివసించిన ఇల్లు అమ్మకానికి పెట్టారంటూ వార్తలు మొదలయ్యాయి.
చెన్నైలోని టీ-నగర్ ప్రాంతంలోని బజుల్లా రోడ్డులో ఉన్న ఈ ఇంటి భయట అమ్మకానికి సిద్ధం అన్న బోర్డు వెలవడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు షాక్ కి గురవుతున్నారు. అయితే ఎన్టీఆర్ గారు చెన్నైలో 1953 నుండి ఈ ఇంటిలోనే నివాసం ఉన్నారు అని తెలుస్తున్నది.
ఆయన పిల్లలు అంతా ఇక్కడే పెరిగినట్టు కూడా చెబుతారు. అటువంటి ఇంటిని ఇప్పుడు ఎవరు పట్టించుకోకుండా వదిలెయ్యడంతో ఆ ఇల్లు ఇప్పుడు నివాసం ఉండడానికి పనికిరాకుండా అయింది.
ఈ పరిస్థితుల్లో దీనిని అమ్మకానికి పెట్టడంతో ఒకరకమైన భావోద్వేగానికి ఆయన అభిమానులు గురవుతున్నట్టు తెలుస్తున్నది.