వరదలతో కుదేలైపోయిన కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రపంచ నలుమూలల నుండి ఆర్ధిక సహాయం వస్తున్నది. అందులో భాగంగానే తెలుగు చిత్ర సీమ నుండి కూడా హీరోలు కూడా తమవంతుగా ఆర్ధిక సహాయాన్ని ప్రకటిస్తున్నారు.
ఇప్పటికే పలువురు హీరోలు తమ సహాయన్ని ప్రకటించగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆయన కుమారుడు హీరో రామ్ చరణ్ చెరో పాతిక లక్షల విరాళం ప్రకటించారు, వీరికి తోడుగా చిరంజీవి తల్లిగారు రూ 1 లక్ష తనవంతుగా సహాయం ప్రకటించారు.
ఇక అల్లు అర్జున్ మొన్ననే రూ 25 లక్షలు, ఎన్టీఆర్, రూ 25 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ 10 లక్షలు, విజయ్ దేవరకొండ రూ 5 లక్షలు తమవంతుగా కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా పంపించారు.
తమ హీరోల చేస్తున్న విరాళం చూసి వారి అభిమానులు కూడా మానవతా దృక్పధంతో సహాయం చేయడానికి ముందుకి వస్తుండడం మంచి పరిణామం.