బుల్లితెర మెగా రియాల్టీ షో 'బిగ్‌బాస్'లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన బాబు గోగినేని గత వారం బిగ్ హౌస్ నుండి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ హౌస్ నుండి బయటికి వచ్చిన ఈయన బిగ్‌బాస్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నానని చెబుతున్నారు. అవునా? అన్నీ నాకే తెలుసంటూ హౌస్ మేట్స్ చేత 'బిగ్గర్ బాస్'గా పిలిపించుకునే ఈయన కూడా ఈ షో నుండి ఎంతో కొంత నేర్చుకున్నానని చెబుతుండడం ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా, ఆ షో అలాంటిది.
ఎంతటి వారికైనా ఇమేజ్ తెచ్చి పెట్టగలదు. ఎంతటి వారినైనా డీగ్రేడ్ చేయగలదు. దురదృష్టవశాత్తూ, బిగ్‌బాస్ సీజన్ 2లో హౌస్ నుండి బయటికి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రకంగా నెగిటివిటీని మూట గట్టుకుని బయటకి వస్తున్నారు. బాబు గోగినేని ఓ హేతువాది. హేతువాదిగా ఆయనను చాలా మంది అభిమానించే వారున్నారు. అలాగే ఆయన హేతువాదం అన్ని వేళలా నచ్చక, ద్వేషించే వారు కూడా ఉన్నారు. అయితే ఆయన్ని అభిమానించే ఆ కొంతమందిలో కొంతమంది ఇప్పుడు ఆయన్ని వ్యతిరేకించేస్తున్నారు. అందుకు కారణం ఉంది.
మీడియాలో కూర్చుని పది మందితో హేతువాదిగా డిబేట్స్ పెట్టిన బాబు గోగినేని, అసలు రియల్ లైఫ్‌లో ఎలా ఉంటాడు. ఎలా బిహేవ్ చేస్తాడు అనే విషయాలు విజువల్‌గా తెలుసుకుంటామని అస్సలు ఎవ్వరూ ఊహించరు. ఆయనే ఊహించరు. అలాంటిది 'బిగ్‌బాస్' షో అందరికీ ఆ అవకాశాన్నిచ్చింది. అయితే ఆ అరుదైన అవకాశంతో ఆయన మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు వాస్తవమే. అయితే అది నెగిటివ్ పాపులారిటీ అని అంటున్నారు.
ఇదంతా సరే, బిగ్‌బాస్ షో గురించి, ఆ షోలో ఆయన అనుభవాలను గురించి మన బిగ్గర్ బాస్ ఓ బుక్ రాస్తారట. ఆ బుక్ ఎలా ఉండబోతోందో చూడాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.