మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ మెగా ప్రొడ్యూసర్ అయిపోయాడు. తొలి సినిమాతోనే నిర్మాతగా సంచలన విజయం అందుకున్న ఉత్సాహం కొనసాగించడానికి చరణ్ సన్నద్ధమవుతున్నాడు. రెండో సినిమాని కూడా తన తండ్రితోనే రామ్‌చరణ్ నిర్మించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్‌లో సెట్స్ మీదకు రానుందని చరణ్ చెప్పాడు. అయితే ఈ సినిమాకి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నాడని ఇదివరకే ఖాయమైంది. స్టయిలిష్ దర్శకుడు సురేందర్‌రెడ్డి, చరణ్ హీరోగా 'ధృవ' సినిమాని తెరకెక్కించి, ఘనవిజయాన్ని అందుకున్నాడు. అది తమిళ సినిమా 'తని ఒరువన్'కి రీమేక్. ఆ సినిమా టైమ్‌లోనే చిరంజీవితో సినిమా చేయాలని ఉందని సురేందర్‌రెడ్డి చెప్పాడు. 'కిక్' తరహా స్టైలిష్ ఎంటర్‌టైనర్‌ని చిరంజీవితో చేయాలని ఉన్నట్లు ఆయన వివరించాడు. దీనికి సంబంధించి కథ కూడా ఓకే అవడంతోనే చరణ్, సురేందర్‌రెడ్డి - చిరు కాంబినేషన్‌లో సినిమాపై ప్రకటన చేసినట్లు సమాచారమ్. ఇంకో వైపున చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు. ఈ సినిమా ఓ కొలిక్కి రాగానే కొరటాల దర్శకత్వంలో తాను హీరోగా చేసే సినిమాని తన స్వీయ నిర్మాణంలోనే చరణ్ సెట్స్ మీదకు తీసుకువెళతాడట. అంటే ఈ ఏడాది మెగానామ సంవత్సరంగా భావించవలసి ఉంటుందేమో. ఏదేమైనా సక్సెస్ ఇచ్చిన జోష్ చరణ్‌లో బాగా కనిపిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకి ఓ మంచి నిర్మాత దొరికాడు చరణ్ రూపంలో. అయితే చరణ్ ఇతర హీరోలతోనూ సినిమాలు చేస్తాడా? లేదా? అన్నదైతే సస్పెన్స్‌గానే ఉందిప్పటికి.