మగధీర-2లో చిరు-చరణ్

మరిన్ని వార్తలు

మగధీర చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోయింది అన్నది నిర్వివాదాంశం.

నిన్న జరిగిన శ్రీవల్లి ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ ముఖ్య అతిధిగా పాల్గొన్న సందర్భంగా రచయత-దర్శకుడు అయిన విజయేంద్రప్రసాద్ కి ఒక ఆసక్తికరమైన ప్రశ్నఎదురైంది. అదేంటంటే- మగధీర 2 చిత్రం తీయవలసి వస్తే,  చిరంజీవి, చరణ్ లలో ఎవరిని తీసుకుంటారు అన్న ప్రశ్నకి- ఇద్దరినీ తీసుకుంటే తప్పేంటి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరు హర్షం వ్యక్తంచేశారు.

ఇక ఈ సమాధానంతో మగధీర 2 కాని చిరంజీవి-రాజమౌళి కలయికలో ఒక చిత్రం రూపొందనుంది అనే వార్తలు ఇప్పుడు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS