ఒకరి కోసం రాసుకున్న కథలు, సన్నివేశాలు ఇంకొకరికి వెళ్ళిపోతుండడం సినీ పరిశ్రమలో చాలా సహజం. అయితే అలా ఒకరి నుండి మరొకరికి వెళ్ళిన కథలు, సన్నివేశాలు హిట్ అయినప్పుడు వాటికి సంబందించిన వార్తలు పాపులర్ అవుతాయి.
అలాంటి సంఘటనే ఒకటి మెగాస్టార్ చిరంజీవి - రాజమౌళి మధ్యలో జరిగింది. ఈ విషయాన్ని నిన్న జరిగిన శ్రీవల్లి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో రచయిత - దర్శకుడు అయిన విజయేంద్రప్రసాద్ చెప్పారు. సింహాద్రి సినిమా విజయం తరువాత చిరంజీవి తమని (రాజమౌళి & విజయేంద్రప్రసాద్) పిలిచి ఒక సినిమా చేద్దామని అడగగా - వారు ‘ఒక యోధుడు 100 మందిని చంపే సన్నివేశం’ చెప్పడం జరిగిందని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం తాము చేయలేకపోయాము అని చెప్పారు.
అయితే ఆ సన్నివేశాన్నే వాడి తరువాత ‘మగధీర’ చేయడం జరిగింది అని చెప్పాడు. దీన్నిబట్టి తండ్రి కోసం అనుకున్నది కొడుకుకి చేరి అదికాస్తా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.