చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చాడు రవితేజ. చిన్న చిన్న పాత్రలతో ఎదిగాడు. హీరో అయ్యాడు. స్టార్ గా మారాడు. ఇప్పుడు మాస్ మహారాజా స్థాయికి చేరుకొన్నాడు. చిరుని చూసి, పరిశ్రమలోకి వచ్చిన రవితేజ... ఇప్పుడు చిరంజీవితో కలిసి నటించాడు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా `వాల్తేరు వీరయ్య`. బాబి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 13న వస్తోంది. ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకొంది. టాక్ అయితే... అదిరిపోయింది. ఈ సినిమా మాస్ హిట్ అవ్వడం గ్యారెంటీ అంటూ.. సెన్సార్ రివ్యూలు బయటకు వచ్చేశాయి.
ఈ సినిమాలోని హైలెట్స్ ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి - రవితేజ మధ్య వచ్చే ఎపిసోడ్లు అదిరిపోయాయట. ఇద్దరినీ శత్రువులుగా పరిచయం చేసి, ఆ తరవాత ఇద్దరి మధ్యా స్నేహం పుట్టించార్ట. శత్రువులుగా ఉన్నప్పుడు ఎంతలా కొట్టుకొంటారో, కలిశాక.. అంతగా ఎమోషన్ పండించార్ట. ద్వితీయార్థంలో రవితేజ, చిరంజీవిలపై తెరకెక్కించిన ఓ లెంగ్తీ ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందని, అది ఈ సినిమా రేంజ్‌ని పెంచేస్తుందని టాక్. క్లైమాక్స్‌కి ముందొచ్చే పాట కూడా బాగా పిక్చరైజ్ చేశార్ట. చిరంజీవి - శ్రుతి హాసన్ మధ్య వచ్చే కామెడీ సీన్లు బాగా నవ్వించాయని టాక్. చిరు ఎంట్రీ సీన్, పడవపై ఫైట్ ఇవన్నీ మాస్‌కి నచ్చుతాయని, ఫస్టాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ తో సాగిందని, ద్వితీయార్థంలో ఎమోషన్లు పండాయని, మొత్తంగా ఈ సినిమా హిట్ అని ఇండస్ట్రీ వర్గాలు ముందే జోస్యం చెబుతున్నాయి. మెగా అభిమానులకు ఇంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది?