కన్నడ సినీ నటుడు కన్నుమూత

మరిన్ని వార్తలు

చిత్ర సీమలో మరో విషాదం ఇది. ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా కన్నుమూశారు. ఈ రోజు ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 39 మాత్రమే. దాదాపు 20 సినిమాల్లో నటించారు. 1980 అక్టోబర్ 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి బెంగళూరులో విద్యాబ్యాసం పూర్తి చేసుకున్నారు. కొన్నాళ్ళు అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశారు. తరవాత నటుడిగా మారారు.

 

వాయుపుత్ర, విజిల్, చిర్రు, అజిత్, రుద్ర తాండవ, సంహార, దండం దశగుణం. చంద్ర లేఖ తదితర సినిమాల్లో లీడ్ రోల్స్‌లో నటించారు. రెండేళ్ల క్రితమే నటి మేఘనా రాజ్‌ను పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి ఆకస్మిక మరణం కన్నడ సీమను విషాదం లో ముంచేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS