దగ్గుబాటి ఇంటి నుంచి ఇప్పటికే ఇద్దరు హీరోలొచ్చారు. వెంకటేష్, రానా... ఇద్దరూ తమ ప్రత్యేకత నిలుపుకున్నారు. ఇప్పుడు మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తనే అభిరామ్. సురేష్‌బాబు తనయుడు అభిరామ్. తన ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. గతేడాదే దగ్గుబాటి అభిరామ్ సినిమాల్లోకి వస్తాడని అనుకున్నారు.
అయితే... ఇప్పుడు అది కార్యరూపం దాల్చిబోతోంది. ఈ యేడాదే అభిరామ్ కెమెరా ముందుకు రాబోతున్నాడు. ఓ యువ దర్శకుడితో అభిరామ్ ఓ ప్రేమకథ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని అభిరామ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ''ఆరు నెలలుగా ముంబైలో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నా. ఓ యువ దర్శకుడి ప్రేమకథకు ఓకే చెప్పా. భవిష్యత్తులోనూ కొత్త దర్శకులతో పని చేస్తా'' అని చెప్పుకొచ్చాడు అభిరామ్.