Chiranjeevi, Rao Ramesh: రావుగారబ్బాయి కావాలన్న చిరు

మరిన్ని వార్తలు

చిరంజీవిని గొప్ప హీరోగా చేసిన విలన్స్ లో రావుగోపాలరావుది అగ్రస్థానం. ఆయనది మామూలు విలనిజం కాదు. చిరంజీవి రావుగోపాలరావు వున్నారంటే చాలు.. ఆ కాంబినేషనే క్రేజీ. ఇప్పుడు తండ్రిలానే అద్భుతమైన నటుడనిపించుకున్నారు రావురమేశ్‌. విలన్ పాత్రలతో కూడా మెప్పిస్తున్నారు. అయితే ఇంతవరకూ చిరంజీవి సినిమాలో ఆయన చేయలేదు. ఇదే అంశాన్ని చిరు పక్కా కమర్షియల్ ఈవెంట్ లో ప్రస్థావించారు.

 

''తండ్రి స్ఫూర్తితో రావురమేశ్‌ సినీ రంగంలోకి వచ్చారు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ గొప్ప నటుడు అయ్యారు. తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ.. మంచి పాత్రలు వేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఐతే ఇంతవరకూ నా అలాగే నా సినిమాల్లో నటించలేదు. ఆయన నా సినిమాలో నటించాలి’’ అని స్వయంగా కోరారు చిరు. ఈ మాటలతో రావురమేశ్‌ ఉద్వేగానికి గురయ్యారు. చిరు కాళ్లకు నమస్కరించి.. హాగ్ చేస్తున్నారు. నిజమే.. రావురమేశ్‌ అద్భుతమైన విలన్ పాత్రలు వేశారు. చిరు సినిమాలో కూడా ఆయన్ని చూడాలని చాలా మంది కోరిక. ఇప్పుడు స్వ్వయంగా చిరు ఆ కోరికని వెల్లబుచ్చారు. ఇప్పుడు దర్శక రచయితలు ఈ దిశగా తప్పగా ఆలోచిస్తారనే చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS