Allari Naresh, Vijay Kanakamedala: 'నాంది' కాంబో రిపీట్

మరిన్ని వార్తలు

అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన 'నాంది' మంచి విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత నరేష్ కెరీర్ లో హిట్ అనే మాట ఈ చిత్రంతోనే వినిపించింది. తాజాగా నరేష్, విజయ్ కలయికలో రెండో చిత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ చిత్రాలు నిర్మించిన నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

 

తన తొలి చిత్రాన్ని విలక్షణమైన కథతో తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కనకమేడల రెండవ సినిమా కోసం పవర్ ఫుల్ కథను సిద్దం చేశారు. ఈ చిత్రం న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది ఈ సినిమాలో నరేష్ మరో ఇంటెన్స్ రోల్ లో కనిపించనున్నారు. ప్రస్తుతం నరేష్ చేస్తున్న ''ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'' పూర్తయిన తర్వాత ఈ చిత్రం ప్రారంభమవుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS