కిల్ ఫేక్ న్యూస్ అనే హ్యాష్ ట్యాగ్‌తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ మోస్తరు యుద్ధమే ప్రకటించాడు కొన్ని వెబ్‌సైట్లపై. అందునా, ఓ ప్రముఖ వెబ్‌సైట్‌పై విజయ్ దేవరకొండ అసహనం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేసిన విషయం విదితమే. పలువురు సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండకు ఇప్పటికే మద్దతు పలికారు. తాజాగా మెగాస్టార్ చిరంజీడి కూడా స్పందించారు. ‘డియర్ విజయ్..’ అంటూ ట్వీట్ ప్రారంభించిన చిరంజీవి, విజయ్ ఆవేదనను తాను అర్థం చేసుకోగలననీ, బాధ్యతలేని రాతల వల్ల విజయ్ దేవరకొండలానే తాను, తన కుటుంబం కూడా బాధపడిన సందర్భాలున్నాయని చెప్పారు. వి
జయ్ దేవరకొండకి ఈ విషయంలో మద్దతుగా వుంటానని చెప్పారు చిరంజీవి. మరోపక్క, కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దరిమిలా, వారిని ఆదుకునేందుకు చేపట్టిన సేవా కార్యక్రమాల్ని కొనసాగించాలని, ఈ క్రమంలో వచ్చే ఇలాంటి ఫేక్ న్యూస్‌లను పట్టించుకోవద్దని చిరంజీవి సూచించారు. జర్నలిస్టులు తమ వ్యక్తిగత అభిప్రాయాల్ని వార్తలుగా ప్రచారం చేయడం సరికాదని కూడా మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా సూచించారు. ‘కిల్ ఫేక్ న్యూస్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని మెగాస్టార్ చిరంజీవి జత చేశారు.
డియర్ విజయ్@TheDeverakonda మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.We stand by you. Pl don't let anything deter ur spirit to do good.Humbly request Journo friends not to peddle individual views as news.#KillFakeNews
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 5, 2020