మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం ఈ నెల మొదట్లో మొదలైన సంగతి విదితమే. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైన మొదట్లోనే బ్రేక్ పడింది.
వివరాల్లోకి వెళితే, సైరా నరసింహా రెడ్డి చిత్రానికి సంబందించిన సెట్ పనులు పెండింగ్ లో ఉండడం అలాగే ప్రధాన తారాగణం కూడా వేరే చిత్రాలతో బిజీ గా ఉండటం వల్ల ఈ చిత్ర యూనిట్ కి జనవరి నెల మొత్తం సెలవలు ప్రకటించదట కొణిదెల ప్రొడక్షన్ టీం. దీనితో షూటింగ్ మొదలైన మొదటి నెలకే ఈ యూనిట్ కి సెలవలు వచ్చేశాయి.
ఇక ఇప్పటివరకు జరిగిన షూటింగ్ విషయానికి వస్తే, మొదటి షెడ్యూల్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ని మెగాస్టార్ చిరంజీవి పైన చిత్రీకరించారట. టాలెంటెడ్ కెమెరామెన్ రత్నవేలు ఈ సినిమాకి పనిచేస్తుండగా యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా సంప్రదిస్తున్నారు.
మరి ఈ హాలిడే బ్రేక్ తరువాత సైరా షూటింగ్ శరవేగంగా సాగిపోవ్వాలని కోరుకుందాం.