ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీపి కబురు అందించింది. సినిమా టికెట్ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అయితే 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన సినిమాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. అలాగే చిన్న సినిమాకు ఐదో షో వేసుకునే వెసులుబాటు కల్పించింది.
''ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పేర్నినాని, అధికారులు, కమిటీకి చిత్ర పరిశ్రమ తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. ‘‘తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగేలా థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ రేట్లు సవరిస్తూ జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారికి కృతజ్ఞతలు. చిన్న సినిమాకు ఐదో షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం’’ అని ట్వీట్ చేశారు చిరు.