దూరంతో సంబంధం లేదు. రాష్ట్రం, దేశం ఇలా ఎంత దూరమైనా గానీ అదే అభిమానం. అదే మెగాస్టార్ చిరంజీవిపై ప్రజలకి ఉన్న అభిమానం. చిరంజీవి పిలుపునిచ్చారని అమెరికాలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజులోనే 51 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు అభిమానులు. ఇది మామూలు విషయం కాదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చిరంజీవి పేరుతో చాలానే చేస్తూ ఉంటారు అభిమానులు. అందుకే అభిమానులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పారు చిరు. తనపై ఇంత అపారమైన అభిమానం చూపిస్తున్న అభిమానులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను ఎంటర్‌టైన్ చేయడం తప్ప.. అని చిరంజీవి అన్నారు. అభిమానులు ఇచ్చే ఉత్సాహం తనలో కొత్త శక్తిని తెస్తుందనీ, ఇలాగే ప్రోత్సహిస్తే, 150 సినిమాలేంటి, మరో 150 సినిమాలైనా అలవోకగా చేసేస్తాను. నా బలం, నా ఆరోగ్యం, నా శక్తి అంతా అభిమానులే అంటున్నారు చిరంజీవి. అలాగే ఆయన 151వ సినిమా 'సైరా నరసింహారెడ్డి' గురించి మాట్లాడుతూ, ఇలాంటి సినిమా చేయాలంటే డబ్బు కాదు, దమ్ముండాలి. ఆ దమ్ము చరణ్‌కి ఉంది. అందుకే ఈ సినిమా చేయగల్గుతున్నాను అన్నారు చిరు. భగత్‌సింగ్ సినిమాలో నటించాలని అనుకున్నాను. కానీ కుదరలేదు. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేబోతోందనీ చిరంజీవి అన్నారు. అలాగే ఇంత గొప్ప సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా సంతృప్తిగా ఉందంటున్నారు చిరంజీవి.